BREAKING
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతిపత్రం.. గుంట్లపేట్‌లో రీ-సర్వే పనుల పరిశీలన మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. హార్టికల్చర్ హబ్ సీమ రూపురేఖలు మార్పు -రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ లక్ష్యం పాతబస్తీ లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది* – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డ్రై డే నాడు కూడా మద్యం ఏరు... బీసిల రిజర్వేషన్లపై రాద్ధాంతం తగదు బిజెపి నేత గాలి హరిప్రసాద్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మునుగోడులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. ధర్మవరంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు * గాంధీజీ ఆశయ సాధనకు తెదేపా కట్టుబడి ఉంది: ధర్మవరం తెదేపా నాయకులు * స్థానిక ఎన్నికలను అడ్డుకుంటూ బీసీల రాజ్యాధికారాన్ని కాలరాస్తున్న వైకాపా * బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుకెళ్లడం వైకాపా నైజం: తెదేపా ధ్వజo జీలుగుమిల్లి మండలం దర్భగూడెం లో ఇటివల జరిగిన పిల్లెం. వెంకయ్య హత్య కేసు ను చేధించిన పోలీసులు. ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవం

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి* ** ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రసాద్

Select Suryaa Now
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి*  ** ఏపీయూడబ్ల్యూజే  రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రసాద్

విజయనగరం, అక్టోబర్ 2 :

 జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్ వి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్  పిలుపుమేరకు  ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఆరిపాక రాము, నార్ల మహంతి సన్యాసిరావు ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమానికి ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కొద్దిసేపు నిరసన కార్యక్రమం జరిగిన అనంతరం  మహాత్మా గాంధీ విగ్రహానికి  యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం  రాష్ట్ర ఎం ఎస్ ఎం ఇ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి కి సంఘం నాయకులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా  రాష్ట్ర నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ అపరిష్కృతంగా నిలిచి ఉన్న జర్నలిస్టు సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు. శాంతియుతంగా తమ సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఉద్దేశంతో  అహింస వాది  మహాత్మా గాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లతోపాటు  సోషల్ మీడియా, డిజిటల్ మీడియా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో మీడియా ప్రసారాలపై నియంత్రణ లేకుండా పోయిందని నియంత్రణ కోసం మీడియా కమిషన్ ను నియమించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కోసం రక్షణ చట్టాలు తేవాలని, వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరిపాక రాము, నార్లమహంతి సన్యాసిరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా  అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఆరోగ్య భీమా అమలకు  పర్యవేక్షణ కమిటీలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను చేర్చాలని, జర్నలిస్టులకు రైల్వే రాయితీపాస్ లు ఇవ్వాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  సంఘం రాష్ట్ర ప్రతినిధి ఎం ఎస్ ఎన్ రాజు,  సంఘం అర్బన్ కమిటీ అధ్యక్షుడు  గొట్టాపుత్రినాధ్, సంక్షేమ కమిటీ అధ్యక్షుడు లింగాల నరసింగరావు, సీనియర్ జర్నలిస్టులు పంచాది అప్పారావు, కేజే శర్మ, వైఎస్ పంతులు, విజయభాస్కర్, కర్రోతు దేవి పలువురు జర్నలిస్టులు  పాల్గొన్నారు.