ఉయ్యాలలో ఊగిన కోతి.. ఆశ్చర్యపోయిన గ్రామస్థులు
సూర్య వీణవంక ;కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఓ కోతి చేసిన వింత చేష్ట స్థానికులను ఆకట్టుకుంది. ఓ ఇంట్లో చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన ఉయ్యాలలోకి ఎక్కిన కోతి కాసేపు అందులో ఊయల ఊగుతూ కనిపించింది.పిల్లల కోసం కట్టిన ఉయ్యాలలో కోతి సరదాగా ఊగుతున్న దృశ్యాన్ని కుటుంబ సభ్యులు ఆసక్తిగా గమనించారు. ఈ దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు నవ్వులు పూయించింది. అనంతరం కోతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం కోతి ఉయ్యాలలో ఊగుతున్న దృశ్యాలు స్థానికంగా ఆసక్తికరంగా మారాయి.