సిర్పూర్(యు)లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
సూర్య జైనూర్ :సిర్పూర్(యు) మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆత్రం శంకరరావు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ ప్రజలను ఏకం చేసి అహింసా మార్గంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని నాయకులు కొనియాడారు. శాంతియుత నిరాహార దీక్షలు, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర్యానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆత్రం శంకరరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు సోయం మోతిరాం, కుమ్ర దేవీదాస్, ఏఎంసీ డైరెక్టర్ లచ్చన్న, మాజీ ఎంపీపీ దౌలతరావు, మండల జనరల్ సెక్రటరీ నాగోరావు, జగ్గారావు, మెంబర్ కోట్నాక్ నాగోరావు, జంగ్నాయక్ కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆత్రం రాము, సిర్పూర్(యు) సర్పంచ్ ప్రకాష్, మాజీ ఎంపీపీ ఆత్రం భగవంత్ రావు తదితరులు పాల్గొన్నారు.