సలుగుపల్లి లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు:
సూర్య బెజ్జుర్ : మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను సర్పంచ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాఉత్సారంగపల్లిజీపీ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వివిధ పార్టీల పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యదర్శి మాట్లాడుతూ.....ప్రపంచానికే సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. "గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు" అని నమ్మిన గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సమైక్యతలను కాపాడుతూ బాపూజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం వి భి జి గ్రామ్ జి గురించి గ్రామసభ నిర్వహించి వివరించారు.,మాదక ద్రవ్యలపై ప్రతిజ్ఞ చేయించారు.గ్రామస్తులు పాలక వర్గం, అంగన్వాడీ, బి ఎల్ ఓ, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.