కాంగ్రెస్ కార్యదర్శి, ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం
సూర్య మెట్‌పల్లి:ఇటీవల కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, ఉపాధ్యక్షుడు ఖలీద్ లను జమైతుల్ అలెహిన్ మెట్‌పల్లి ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా,ఖలీద్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఖారీ మహమూద్-ఉల్-హసన్ సాహిబ్ - జమియత్ ఉలమా అధ్యక్షులు, మౌలానా అబ్దుల్ హమీద్ సాహిబ్ మదర్స అరబియా తజ్వీద్-ఉల్-ఖురాన్ నాజిమ్.
హాఫిజ్, అబ్దుల్ అజీజ్, సాహిబ్ - జమియత్ ఉలమా ఉపాధ్యక్షులు.
ముఫ్తీ అబూ బకర్ సిద్ధిఖ్ సాహిబ్ - జమియత్ ఉలమా ప్రధాన కార్యదర్శి. హాఫిజ్ ఉస్మాన్ సాహిబ్ - జమియత్ ఉలమా కోశాధికారి. తదితరులు పాల్గొన్నారు