BREAKING
సత్యం.. అహింసే గాంధీజీ చూపిన మార్గం: కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మొబైల్ షాప్ యజమానులతో అవగాహన సమావేశం** పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపు అహింస, సత్యమే మానవాళికి రక్షణ కవచాలు - వైభవంగా గాంధీ జయంతి వేడుకలు గొల్లపూడిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి ఉస్మాన్ నగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు. గాంధీ జయంతి సందర్భంగా 120 మందికి రూ.68.12 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన పామిడి బిజెపి నాయకులు గాంధీ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నివాళులు. ప్రజల సౌకర్యార్థం తహశీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల వసతులు- జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ హత్య. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టర్ నివాళులు అభివృద్ధి పనుల గుర్తింపునకు ఆవులమందలో గ్రామసభ నూతులపాడు ఊరచెరువును మట్టి తవ్వకాన్ని మహిళా మండలికి ఇవ్వాలి

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలి

Select Suryaa Now
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలి

టియుడబ్ల్యూజె (ఐజెయు) వికారాబాద్ జిల్లా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ చారి 
వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్(అక్టోబర్ 02): : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) వికారాబాద్ జిల్లా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ చారి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) వికారాబాద్ జిల్లా జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,…. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పాత్రికేయులు,  మీడియా పరిశ్రమకు సంబంధించిన కీలకమైన, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై తక్షణమే పరిష్కరించాలన్నారు.
రెండవ పత్రికా కమిషన్‌ను 1978లో నియమించగా, అది 1982లో తన నివేదికను సమర్పించిందని, గత నాలుగు దశాబ్దాలుగా 24/7 ప్రసార నెట్‌వర్క్‌లు, డిజిటల్ వార్తా వేదికలు, ప్రజా చర్చలను తీవ్రంగా ప్రభావితం చేసే సోషల్ మీడియా వ్యవస్థల ఆవిర్భావంతో భారత మీడియా రంగం అపూర్వమైన పరివర్తనకు లోనైందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, జిల్లా కోశాధికారి, జిల్లా అక్రిడేషన్ సభ్యుడు రాఘవేందర్ మాట్లాడుతూ…,పాత్రికేయులు, మీడియా సంస్థల భద్రత కోసం ఒక ప్రత్యేక కేంద్ర చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఇళ్లు, ఇళ్లస్థలాల  సమస్య పరిష్కరించాలని తెలిపారు. ఉద్యోగులకు ఇచ్చిన విధంగా జర్నలిస్టులకు  హెల్త్ కార్డులు  ఇచ్చి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై నిత్యం జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తగిన చట్టం తీసుకు  రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘం నాయకులు షఫీ, వెంకటేష్, అశోక్, ప్రవీణ్ చారి, రాజు, రవీందర్, ప్రమోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.