పైలట్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోడీ ఫోన్: ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ, ధైర్యసాహసాలకు ప్రశంసలు
న్యూఢిల్లీ: అబుదాబి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విమాన పైలట్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ప్రధాని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విమానంలో కో-పైలట్ తనపై అనూహ్యంగా ఏ విధంగా దాడికి తెగబడ్డాడో, ఆ క్లిష్ట సమయంలో తాను సమయస్ఫూర్తితో ఎలా వ్యవహరించాడో పైలట్ మచ్చర్ ప్రధానికి వివరంగా వెల్లడించారు. అలాగే ఆ క్లిష్ట పరిస్థితుల్లో తనలో ధైర్యాన్ని నింపిన అంశాలను ఆయన ప్రధానితో పంచుకున్నారు. అత్యంత ప్రమాదకర సమయంలోనూ ప్రాణాలకు తెగించి విమానాన్ని, ప్రయాణికులను కాపాడేందుకు మచ్చర్ ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను ప్రధాని మోడీ కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని ఆకాంక్షించారు.