BREAKING
నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృత ఎన్ఫోర్స్మెంట్ చర్యలు బొగ్గు బట్టీల్లో వెట్టిచాకిరీకి విముక్తి నల్గొండలో జర్నలిస్టుల నిరసనలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం. చిన్నారులకు పౌష్టికాహారం.. ‘తొలి ముద్ద’కు శ్రీకారం గాంధీజీ జీవితం ఆదర్శనీయం -ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి : జెసి ఆర్.గోవింద రావు గాంధీ బాటలోనే స్వచ్ఛ గ్రామ స్వరాజ్యం.. బెజ్జుర్ మండలకేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు... జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి . సీమ రూపురేఖలు మార్చబోతున్నగ్లోబల్ హార్టికల్చర్ హబ్ వికలాంగులకు ర్యాంప్‌ ఏదీ? అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఉమ్మడి రవాణా పాస్ గాంధీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం సత్యం, అహింసా మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి…. - నగర మేయర్ ధర్ని మధుకర్ సీఎం డిప్యూటీ సీఎంతో అనంత్ అంబానీ బేటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి* ** ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రసాద్

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా CJP నిరసనలు.. ఇంటర్నెట్ బంద్, 11 మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత

Select Suryaa Now
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా CJP నిరసనలు.. ఇంటర్నెట్ బంద్, 11 మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహ తలపెట్టిన భారీ ఆందోళనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శాంతిభద్రతల దృష్ట్యా జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు.

ముందస్తు జాగ్రత్త చర్యగా రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ సహా దాదాపు 11 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జంతర్ మంతర్ తో పాటు కన్నాట్ ప్లేస్ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు.

పోలీసుల అనుమతి లేనప్పటికీ CJP కార్యకర్తలు, ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో తరలిరావడానికి యత్నించడంతో పోలీసులు, కేంద్రీయ బలగాలను భారీగా మోహరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.