BREAKING
భీమ్‌గల్ పట్టణంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గం మనందరికీ ఆదర్శం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం ఉయ్యాలలో ఊగిన కోతి.. ఆశ్చర్యపోయిన గ్రామస్థులు మహాత్ముల జీవితాలు ఆదర్శణీయం - ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి రిలయన్స్ అధినేత అనంత్ అంబానీకి ఘన స్వాగతం కేవలం ఉత్సవాలకే పరిమితం కాదు.. ప్రజాస్వామ్యానికి గాంధీ ఆలోచనలు నేడు అత్యంత ఆవశ్యకం: రాజ్ థాకరే కీలక వ్యాఖ్యలు మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జనసేన నేత గురాన అయ్యలు గాంధీజీ చూపిన మార్గాలు కొణిదల పవన్, నారా లోకేష్ కు ఘన స్వాగతం పైలట్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోడీ ఫోన్: ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ, ధైర్యసాహసాలకు ప్రశంసలు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: దేవీ విగ్రహంతో వెళ్తుండగా బొలెరోను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి, 19 మందికి గాయాలు

Select Suryaa Now
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: దేవీ విగ్రహంతో వెళ్తుండగా బొలెరోను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి, 19 మందికి గాయాలు

ముంబై: దేవీ నవరాత్రి ఉత్సవాల వేళ మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమరావతి జిల్లా ధమన్‌గావ్ సమీపంలోని సమృద్ధి మహామార్గ్‌పై వేగంగా వచ్చిన ఒక ట్రక్కు, బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

షెగావ్ నుంచి దుర్గాదేవి విగ్రహాన్ని తమ ఊరికి తీసుకెళ్తుండగా ఈ భయానక ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పండుగ వాతావరణం నెలకొనాల్సిన సమయంలో ఈ విషాదం జరగడంతో ఆయా గ్రామాల్లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.