మహాత్ముల జీవితాలు ఆదర్శణీయం - ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి
మహాత్ముల జీవితాలు ఆదర్శణీయం
- ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి
- గాంధీ, శాస్త్రీ, కామరాజ్ చిత్రపటాలకీ నివాళులు
వేంపల్లె మేజర్ న్యూస్:
స్వాతంత్ర్య ఉద్యమంలో, ఉద్యమనంతరం దేశానికి అందించిన సేవల్లో మహాత్ముల జీవితగాధలై ప్రతి ఒక్కరికీ ఆదర్శణీయం అని ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, కామరాజ్ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. వీరి చిత్రపటాలకీ నివాళులు అర్పించారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ మానవ ఇతిహాసంలోనే విలక్షణమైన విశిష్టమైన నాయకుడు మహాత్ముడు.. సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారన్నారు. గాంధీ బోధనలే ప్రపంచానికి శ్రీరామరక్ష అని ఉద్భోవించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి నిరాండబరతకు, నీతికి నిజాయితీకి, నిర్భీతికి నిలువెత్తు నిదర్శనమన్నారు. భారత్-పాక్ యుద్ధంలో దేశాన్ని విజయ పథాన నడిపిన విజయ సారథి శాస్త్రీ అని అన్నారు. భారత రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పేరొందిన భారతరత్న కామరాజ్ నాడార్ తొమ్మిదేళ్ల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించారని, ఆయన అందించిన సేవలపై కొనియాడారు. ఈ కార్యక్రమంలో తులసిరెడ్డి సతీమణి అలివేలమ్మ, నాయకులు సుబ్రమణ్యం, దృవకుమార్ రెడ్డి, అమర్, ఉత్తన్న, రవీంద్రారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.