కొణిదల పవన్, నారా లోకేష్ కు ఘన స్వాగతం
అన్నమయ్య జిల్లా ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపనకు శుక్రవారం మదనపల్లి కొండమర్రి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్, ఆం.ప్ర రాష్ట్ర విద్యాశాఖ, హెచ్ ఆర్ డి మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్, ఆం.ప్ర రాష్ట్ర విద్యాశాఖ, హెచ్ ఆర్ డి మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికినరాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,రాష్ట్ర రవాణా మరియు క్రీడ యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వయ్యావుల కేశవ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, కోడూరు శాసన సభ్యులు ఆరవ శ్రీధర్, తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనవాసులు అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. షుగవాసి ప్రసాదబాబు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, హస్తకలల నైపుణ్యభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, మదనపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాం, తదితర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రజలు తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి