నేడు మండలంలో సర్వసభా సమావేశం - ఎంపీడీవో ఉమాదేవి
నేడు మండలంలో సర్వసభా సమావేశం - ఎంపీడీవో ఉమాదేవి
గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష
కోహీర్ ; కోహీర్ మండలంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమీక్ష నిర్వహించేందుకు అక్టోబర్ 1, గురువారం సర్వసభా సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు నేడు ఉదయం 11 గంటలకు కోహీర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో* సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు సమావేశానికి హాజరు కావాలని సూచించారు.గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, పెండింగ్‌లో ఉన్న పనులు తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పూర్తి వివరాలతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు.