అంగన్వాడీ కేంద్రం-1ను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల అర్బన్: నంద్యాల మండలం పోలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి చదువు, ఆటలు, ఆరోగ్యం, ఆహారపు అలవాట్లకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
చిన్నారుల అభ్యసన సామర్థ్యాన్ని, చురుకుదనాన్ని పరిశీలిస్తూ వారితో సరదాగా మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా అందుతున్న పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య పరిరక్షణ సేవలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.