నమో వనం పథకం కోసం స్థలాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్
నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నమో వనం (NAMO VANAM) పథకం అమలుకు ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్, డీఎఫ్ఓ మల్లీశ్వరి, ఆర్డీఓ విశ్వనాథం, అర్బన్ తహసీల్దార్ పత్తి సత్య శ్రీనివాసులు తో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నమో వనం పథకం కోసం గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు. పథకం అమలుకు అవసరమైన స్థల పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, మొక్కల పెంపకం మరియు సంబంధిత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నమో వనం పథకం ద్వారా పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు.