సూర్య కథనానికి స్పందన - వరి పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి
సూర్య- బిక్కనూర్ :మండలంలోని వరి పంట పొలాలకు తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టపోతున్నారని, పత్తాలేని వ్యవసాయ అధికారులు అనే శీర్షికతో సూర్య దినపత్రికలో సోమవారం వార్త ప్రచురించగా, స్పందించిన వ్యవసాయ అధికారులు రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో తెగుళ్లు సోకిన వరి పంట పొలాలను, మండల వ్యవసాయ అధికారి నాగరాజు రెడ్డి మంగళవారం పరిశీలించారు.
వరి పంటకు వర్షాభావ పరిస్థితుల వల్ల తెగుళ్లు ఏర్పడ్డాయని, వాటికి సంబంధించిన మందులను తగిన మోతాదులో పిచికారి చేయాలని తగు సలహాలు, సూచనలు రైతులకు చేశారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు. సూర్య కథనానికి స్పందించి వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించడం పట్ల రైతులు సూర్య పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తక్కల్ల నర్సారెడ్డి, రైతులు పాల్గొన్నారు