సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం
సిరిసిల్ల, సూర్య న్యూస్ నెట్వర్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లలో పాదయాత్రను ప్రారంభించారు. సీఎం వెంట మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో సిరిసిల్లలో సందడి నెలకొంది.
సుమారు నాలుగు కిలోమీటర్ల మేర సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర మార్గంలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు సీఎంకు ఘన స్వాగతం పలుకుతున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రూ.350 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది.