గంజలి బడే సాబ్ దర్గాలో సోమనాథ్ అన్నదానం
గంజెళ్ల బడేసాబ్ దర్గాలో సోమనాథ్ ప్రత్యేక ఫాతేహాలు
గోనెగండ్ల సూర్య
గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామంలోని శ్రీ గంజెళ్ల బడేసాబ్ తాత దర్గాను రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ గురువారం సందర్శించారు. ఎమ్మిగనూరు చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప ముని మనవడు, ఎంజీబీ మొబైల్స్ అండ్ ఎంజీ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ మాచాని ఆదిత్య జన్మదినం సందర్భంగా దర్గాలో ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించారు. బడేసాబ్ తాత ఆశీస్సులతో ఆదిత్యకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా భోజనాలు వడ్డించి, ప్రజలతో కలిసి భోజనం చేశారు.