BREAKING
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోదీ సెల్యూట్: "ఆయన నిజమైన హీరో.. భారత్ గర్విస్తోంది!" సునీల్ కుమార్‌లకు రాష్ట్రపతి అభినందనలు సుదూర వాణిజ్యంలో గుజరాత్ ది కీలక భూమిక ఆసియాన్ నౌకాదళాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారం భక్తులతో తిరుమల కిటకిట.. మీకోసం మేమున్నాం,,మంచి చేస్తాం,,మార్పు తీసుకు వస్తాం స్థానిక ఎన్నికలపై జగన్‌ ఫోకస్‌.. నేడు కీలక భేటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు పిలుపు తారకరామా నగర్ లో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం ఉండ్రాజవరంలో నేడు వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ: పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ ధర్మవరంలో ఘనంగా 'NTR భరోసా' పెన్షన్ల పంపిణీ ప్రతి అర్హుడికీ సంక్షేమం అందడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: హరీశ్ బాబు అర్హులైన ప్రతి కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా : పనబాక లక్ష్మి కరెంటు కోతలతో ఎండుతున్న వరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 75వ జయంతి: కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలు

శంకుస్థాపనకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌…!

Select Suryaa Now
శంకుస్థాపనకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌…!
15 నెలలుగా ముందుకు సాగని నిర్మాణ పనులు
మొరం తరలింపుపై ఆరోపణలు.. పీఎస్‌ఎస్‌ రైస్‌మిల్‌ మిషన్లపైనా ప్రశ్నలు
కాగ్నా కాలుష్యంపై నీటి నమూనాలు సేకరించి పరీక్షించాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌
 
యాలాల, మేజర్‌ న్యూస్‌: మండలంలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. దౌలాపూర్‌ సమీపంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం 15 నెలలు గడిచినా ముందుకు సాగకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం బీఆర్‌ఎస్‌ మండల నాయకులు దౌలాపూర్‌ సమీపంలోని ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠశాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పాఠశాల స్థలంలో ఉన్న మొరాన్ని అనుమతులు లేకుండా తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.
రైస్‌మిల్‌ మిషన్ల వ్యవహారంపైనా ప్రశ్నలు
యాలాలలో మంజూరైన పీఎస్‌ఎస్‌ రైస్‌మిల్‌లోని విలువైన యంత్రాల విక్రయానికి సంబంధించి కూడా బీఆర్‌ఎస్‌ నాయకులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. మిల్లులోని యంత్రాలు విక్రయించారనే ఆరోపణలపై సంబంధిత రికార్డులను పరిశీలించి, యంత్రాల ప్రస్తుత పరిస్థితి, విక్రయానికి సంబంధించిన వివరాలను అధికారులు స్పష్టం చేయాలని కోరారు.
కాగ్నా కాలుష్యంపై ఆందోళన
జక్కేపల్లి గ్రామంలోని ఆర్‌బీఓఎల్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు కాగ్నా నదిలోకి చేరుతున్నాయనే ఆరోపణలపై కూడా బీఆర్‌ఎస్‌ నాయకులు స్పందించారు. వ్యర్థ జలాల కారణంగా నది నీరు, పరిసర ప్రాంతాల భూగర్భ జలాల నాణ్యతపై ప్రభావం పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బెన్నూరు గ్రామంలో తాగునీటి నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలపై సంబంధిత అధికారులు నీటి నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షించాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు అరవింద్‌రెడ్డి కోరారు. ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని అన్నారు.
స్పందించకపోతే ఆందోళన
ప్రజా సమస్యలపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ అరవింద్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మప్ప శరణ్‌ భూపాల్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, చంద్రశేఖర్‌రెడ్డి, లాలు ముదిరాజ్‌, యువనాయకులు మహేశ్వర్‌రెడ్డి, మెట్లి కృష్ణ, దేవేందర్‌గౌడ్‌, శ్రీశైలం, విక్రాంత్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
రిపోర్టర్ జీ.ప్రకాష్ గౌడ్.