BREAKING
ఢిల్లీలో 11 మెట్రో స్టేషన్లు మూసివేత, జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం సీజేపీ ఆందోళన కదిరిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు దేవాదుల, ,ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు సెలవుకు 'నో ఎంట్రీ'.. శ్రీ చైతన్య స్కూల్ డ్యూటీ! గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి *మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మిజోరంలో ఘోర రోడ్డు ప్రమాదం: దూరదర్శన్, పీఐబీ అధికారుల దుర్మరణం.. మహాత్ముడికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలి పేదల సంక్షేమం.. గ్రామాల అభివృద్ధే లక్ష్యం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ: ఫాహద్ ఫాజిల్ తెలుగు ఎంట్రీ ఎలా ఉంది? ఆత్మతో సూరి ప్రయాణంలో నవ్వులెన్ని, నిరాశ ఎంత గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి - ఎమ్మెల్యే ప్రమాదపుటంచున పట్టణ దారుల్లో కలవర్ట్లు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అక్టోబర్ ఉత్సవాల సందడి: పార్థసారథి ఊరేగింపులు, వేదాంత దేశికర్ ఉత్సవం, పౌర్ణమి గరుడ సేవ పూర్తి వివరాలు

కరెంటు కోతలతో ఎండుతున్న వరి

Select Suryaa Now
కరెంటు కోతలతో ఎండుతున్న వరి

అధికారులు స్పందించాలంటూ.. బిజెపి మండలాధ్యక్షులు వడ్ల అరవింద్ చారి డిమాండ్ 

 

 రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వేళాపాళా లేని కరెంట్ కోతలతో అన్నదాతల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నదని భారతీయ జనతాపార్టీ నందిగామ మండలాధ్యక్షులు వడ్ల అరవింద్ చారి ఆరోపించారు.వ్యవసాయరంగానికి 24గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతో ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే విద్యత్తు సరఫరా చేస్తుండడంతో నీరు సరిపోక పొట్టకొచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నీరు లేక తమ కళ్ళముందే ఎండిపోతుండడం చూసి రైతన్నల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని అరవింద్ చారి విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ చర్యలతో వ్యవసాయరంగానికి 24గంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేసి రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం నందిగామ మండలం నర్సప్పగూడ శివారులో కరెంట్ కోతలతో నీరు లేక ఎండిన వరిపంటలను రైతులతో కలిసి అరవింద్ చారి పరిశీలించారు.

- కావలి ప్రభాకర్ : మేజర్ న్యూస్, నందిగామ.