వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
అనంతపురం బ్యూరో : అనంతపురంలోని హెచ్‌ఎల్‌సీ కాలనీలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మహాత్మా గాంధీ సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరై జయంతి వేడుకల్లో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను, సత్యం, అహింస సిద్ధాంతాల ద్వారా ప్రజలకు అందించిన సందేశాన్ని నాయకులు గుర్తుచేసుకున్నారు. గాంధీజీ ఆశయాలు, విలువలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ చూపిన శాంతి, అహింస మార్గాలను అనుసరిస్తూ సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం, సేవాభావాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.