గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రికి కొణతాల ఘన నివాళి…
అనకాపల్లి ప్రతినిధి, అక్టోబర్ 2, మేజర్ న్యూస్:
స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ అందించిన సేవలను, దేశ నిర్మాణంలో లాల్‌బహదూర్ శాస్త్రి చేసిన కృషిని స్మరించుకున్నారు. వారి ఆశయాలు, దేశభక్తి, సత్యం, అహింస, క్రమశిక్షణ వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.