BREAKING
భీమ్‌గల్ పట్టణంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గం మనందరికీ ఆదర్శం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం ఉయ్యాలలో ఊగిన కోతి.. ఆశ్చర్యపోయిన గ్రామస్థులు మహాత్ముల జీవితాలు ఆదర్శణీయం - ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి రిలయన్స్ అధినేత అనంత్ అంబానీకి ఘన స్వాగతం కేవలం ఉత్సవాలకే పరిమితం కాదు.. ప్రజాస్వామ్యానికి గాంధీ ఆలోచనలు నేడు అత్యంత ఆవశ్యకం: రాజ్ థాకరే కీలక వ్యాఖ్యలు మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జనసేన నేత గురాన అయ్యలు గాంధీజీ చూపిన మార్గాలు కొణిదల పవన్, నారా లోకేష్ కు ఘన స్వాగతం పైలట్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోడీ ఫోన్: ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ, ధైర్యసాహసాలకు ప్రశంసలు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం

మన్యం జిల్లా పాడి రైతుల వినూత్న ప్రయోగం.. సబ్సిడీతో సమకూరుతున్న మేలుజాతి సంపద

Select Suryaa Now
మన్యం జిల్లా పాడి రైతుల వినూత్న ప్రయోగం.. సబ్సిడీతో సమకూరుతున్న మేలుజాతి సంపద

 

పార్వతీపురం, అక్టోబర్ 02 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో అమలు చేస్తున్న "లింగ నిర్ధారిత వీర్యం" పథకం గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపదను పెంపొందించడంలో గొప్ప విజయాన్ని సాధిస్తోంది. సాధారణంగా ఒక ఎద సూది ఖరీదు రూ. 300 కాగా, ప్రభుత్వం రూ. 150 సబ్సిడీగా అందిస్తోంది. దీంతో రైతు కేవలం రూ. 150 వాటాతో ఈ ఆధునిక సేవలను పొందగలుగుతున్నారు. ఈ సాంకేతికత ద్వారా దాదాపు 90 శాతం ఖచ్చితత్వంతో మేలుజాతి పెయ్య దూడలే జన్మిస్తున్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ సంఖ్యలో మేలుజాతి పెయ్య దూడలు పుట్టడం వల్ల గ్రామాలలో నాణ్యమైన పశు సంపద వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో ఈ పెయ్య దూడల ద్వారా పాలదిగుబడి గణనీయంగా పెరిగి, పాడి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు వారి కుటుంబాలకు నిలకడైన ఆదాయం చేకూరుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తున్న ఈ పథకం మన్యం జిల్లాలోని పాడి రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తూ విజయవంతంగా కొనసాగుతోంది.