BREAKING
స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గం మనందరికీ ఆదర్శం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం ఉయ్యాలలో ఊగిన కోతి.. ఆశ్చర్యపోయిన గ్రామస్థులు మహాత్ముల జీవితాలు ఆదర్శణీయం - ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి రిలయన్స్ అధినేత అనంత్ అంబానీకి ఘన స్వాగతం కేవలం ఉత్సవాలకే పరిమితం కాదు.. ప్రజాస్వామ్యానికి గాంధీ ఆలోచనలు నేడు అత్యంత ఆవశ్యకం: రాజ్ థాకరే కీలక వ్యాఖ్యలు మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జనసేన నేత గురాన అయ్యలు గాంధీజీ చూపిన మార్గాలు కొణిదల పవన్, నారా లోకేష్ కు ఘన స్వాగతం పైలట్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోడీ ఫోన్: ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ, ధైర్యసాహసాలకు ప్రశంసలు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాంధీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి

Select Suryaa Now
గాంధీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి

సత్యం, అహింస, శాంతి, సహనం, క్రమశిక్షణను పాటించాలి
వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 2):
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, సహనం, క్రమశిక్షణ, సేవాభావం వంటి గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమన్నారు. గాంధీజీ తన జీవితాన్ని సత్యం, అహింస సిద్ధాంతాలకు అంకితం చేసి ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపారని తెలిపారు. ఆయన ఆలోచనలు సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ప్రజలు పరస్పరం గౌరవించుకోవడంతో పాటు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, చట్టాలను గౌరవించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

*ప్రజలకు మెరుగైన సేవలందించాలి

ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో పాటు మానవతా దృక్పథాన్ని పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆదేశించారు.మహాత్మా గాంధీ కలలుగన్న శాంతియుత, సమానత్వం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను రోజువారీ జీవితంలో ఆచరించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ అంజయ్య, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, ఆర్‌ఐలు శ్రీశైలం, అశోక్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.