BREAKING
చిన్నారులకు పౌష్టికాహారం.. ‘తొలి ముద్ద’కు శ్రీకారం గాంధీజీ జీవితం ఆదర్శనీయం -ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి : జెసి ఆర్.గోవింద రావు గాంధీ బాటలోనే స్వచ్ఛ గ్రామ స్వరాజ్యం.. బెజ్జుర్ మండలకేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు... జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి . సీమ రూపురేఖలు మార్చబోతున్నగ్లోబల్ హార్టికల్చర్ హబ్ వికలాంగులకు ర్యాంప్‌ ఏదీ? అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఉమ్మడి రవాణా పాస్ గాంధీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం సత్యం, అహింసా మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి…. - నగర మేయర్ ధర్ని మధుకర్ సీఎం డిప్యూటీ సీఎంతో అనంత్ అంబానీ బేటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి* ** ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రసాద్ భీమ్‌గల్ పట్టణంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఘన నివాళులు

Select Suryaa Now
గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఘన నివాళులు

నెల్లూరు, మేజర్ న్యూస్:   జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలను వారు స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ అనుసరించిన అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, సత్యనిష్ఠలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను గుర్తు చేసుకోవాలని వారు అన్నారు. దేశం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు, ప్రజలకు ఆయన చూపిన మార్గం ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో పాటు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.