గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం
చీపురుపల్లి అక్టోబర్ 2 మేజర్ న్యూస్:
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో గాంధీ జయంతి పురస్కరించుకొని శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. ఆర్డీవో ఎం సుధారాణి, డీడీఓ కొత్తకోట హేమసుందరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలో గల నాలుగు మండలాల ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవో లు, సచివాలయం సిబ్బంది హాజరై రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చీపురుపల్లి ఇంచార్జ్ బీవీ గోవిందరాజులు, టీడీపీ నాయకులు రౌతు కాము నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు రామచంద్రుడు, అధికార ప్రతినిధి మొగసాల రమేష్, ఆరతి సాహు, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, ఇజ్జిరోతు రాంబాబు, జనసేన నాయకుడు వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.