ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి
మేడ్చల్ ,మేజర్ న్యూస్ (అక్టోబర్ 2):
ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ… గాంధీజీ చూపిన శాంతి, అహింసా మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ తలారి శివకుమార్.