గాంధీ జయంతి వేడుకలు
సూర్య పెగడపల్లి:బతికపెల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ ముంజ మహేశ్వరి మధుకర్ గౌడ్ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధించిన సత్యం, శాంతి, అహింసా మార్గాన్ని అనుసరించి మంచి సమాజాన్ని నిర్మించాలని తెలిపారు. గాంధీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కస్తూరి పద్మ, కార్యదర్శి నిఖిల్ రెడ్డి, వార్డు సభ్యులు కట్ల రాజు కుమార్ పెంట నాగరాణి, నిమ్మరాయ మల్లవ్వ, షేక్ సమ్రీన్, షేక్ షకీల్, నాయకులు చంద్రశేఖర్ గౌడ్ రఘుపతి, శ్రీనివాస్,అంజయ్య, చంద్రమౌళి,ఏఎన్ఎం సంధ్య అంగన్వాడీ టీచర్స్ సౌజన్య, శైలజ,రమాదేవి, గౌతమి, రేణుక,ఆశ వర్కర్స్, మల్లీశ్వరి, సంతోష అనూష,లత తదితరులు పాల్గొన్నారు.