గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలి
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన రోటరీ బృందం
మహనీయుల సేవలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలి :రోటరీ క్లబ్ ప్రసిడెంట్ మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి
జమ్మలమడుగు మేజర్ న్యూస్:
పట్టణంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం పూల మాల వేసి రోటరీ క్లబ్ ప్రసిడెంట్ మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర్య సమర యోధుడు గాంధీజీ మన మధ్యన లేకున్నా ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని తెలిపారు. అంతే కాకుండా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని కోరారు. మహనీయుల సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు కుండా భాస్కర్, మాజీ రోటరీ సెక్రటరీలు పార్థ సారథి, సంజీవ రాయుడు, గండికోట చారిట్రబుల్ ట్రస్టు ఛైర్మెన్ యనముల చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.