గాంధీ విగ్రహానికి పాలాభిషేకం
సూర్య, జన్నారం : జన్నారం మండలం పొనకల్లోని గాంధీనగర్ కాలనిలో గాంధీజయంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ నగర్ లో గల గాంధీ విగ్రహానికి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలభిషేకము చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జక్కు భూమేష్, సెక్రెటరీ నరేంద్ర గోపాలకృష్ణ, ట్రెజరర్ మల్యాల కిరణ్, మరియు ఆర్యవైశ్యలు పాల్గొన్నారు.