BREAKING
ఢిల్లీలో 11 మెట్రో స్టేషన్లు మూసివేత, జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం సీజేపీ ఆందోళన కదిరిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు దేవాదుల, ,ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు సెలవుకు 'నో ఎంట్రీ'.. శ్రీ చైతన్య స్కూల్ డ్యూటీ! గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి *మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మిజోరంలో ఘోర రోడ్డు ప్రమాదం: దూరదర్శన్, పీఐబీ అధికారుల దుర్మరణం.. మహాత్ముడికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలి పేదల సంక్షేమం.. గ్రామాల అభివృద్ధే లక్ష్యం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ: ఫాహద్ ఫాజిల్ తెలుగు ఎంట్రీ ఎలా ఉంది? ఆత్మతో సూరి ప్రయాణంలో నవ్వులెన్ని, నిరాశ ఎంత గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి - ఎమ్మెల్యే ప్రమాదపుటంచున పట్టణ దారుల్లో కలవర్ట్లు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అక్టోబర్ ఉత్సవాల సందడి: పార్థసారథి ఊరేగింపులు, వేదాంత దేశికర్ ఉత్సవం, పౌర్ణమి గరుడ సేవ పూర్తి వివరాలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరువు మండలాల ప్రకటన

Select Suryaa Now
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరువు మండలాల ప్రకటన

కర్నూలు: సూర్య ప్రతినిధి: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మండలాల జాబితాను అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 15 మండలాలు తీవ్ర వర్షాభావ మండలాలుగా గుర్తించినట్లు వివరాలు సూచిస్తున్నాయి.
కర్నూలు రూరల్, ఓర్వకల్, హొళగుంద, హాలహర్వి, వెల్దుర్తి, చిప్పగిరి, కర్నూలు అర్బన్, కృష్ణగిరి, పత్తికొండ, తుగ్గలి, గూడూరు, కోడుమూరు, ఆదోని-1, మద్దికెర తదితర మండలాలు ఈ జాబితాలో ఉన్నాయి.
అదేవిధంగా నంద్యాల జిల్లాలో తీవ్ర వర్షాభావం ఉన్న 26 మండలాలు, మోస్తరు వర్షాభావం ఉన్న 2 మండలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. నందికొట్కూరు, డయల్, జూపాడు బంగ్లా, కొత్తపల్లె, ఆత్మకూరు, పాములపాడు, మిడ్తూరు, పాణ్యం, గడివేముల, వెలుగోడు, బండి ఆత్మకూరు, నంద్యాల రూరల్, మహానంది, శిరివెళ్ల, గోస్పాడు,అవుకు బనగానపల్లి,  కోయిలకుంట్ల, రుద్రవరం, దోర్నిపాడు, ఉయ్యాలవాడ, నంద్యాల అర్బన్, బేతంచెర్ల, డోన్, ప్యాపులి ఆళ్లగడ్డ , చాగలమర్రి తదితర మండలాలు జాబితాలో ఉన్నాయి.వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం, తాగునీరు, పశువుల మేత తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గంలోని 7 మండలాలను కరువు మండలాలుగా గుర్తించకపోవడం శోచనీయం.. ఇప్పటికే ఆయా మండలాల్లో వ్యవసాయ కూలీలు రైతులు పంటలు ఎండిపోయి వలస బాట పట్టారు. అయినా కూడా కరువును గుర్తించే అధికారులు ఎందుకు మంత్రాలయం ఎమ్మిగనూరు నియోజకవర్గం విస్మరించారని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు