*మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి*
విజయనగరం, అక్టోబర్ 2 మేజర్ న్యూస్:
జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యమని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి మరియు దేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, అలాగే లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబుతో పాటు పలువురు జిల్లా అధికారులు మరియు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని మహాత్మునికి, శాస్త్రి గారికి నివాళులు అర్పించారు.