BREAKING
బాపూజీ, శాస్త్రిజీల ఆదర్శాలు నిత్య స్మరణీయం: మంత్రి నారా లోకేష్ గాంధీజీ ఆశయాలే భావితరాలకు మార్గదర్శకం:రాకేష్ రెడ్డి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజె ప్రతినిధులు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి గాంధీజీ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి. ఎస్సై ఎం హేమలత. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు.... అధికారులు. తిరుమల శ్రీవారికి నిత్యం 45 రకాల నైవేద్యాలు: మిర్చి లేకుండా మిరియాలతోనే వైఖానస ఆగమ ప్రసాదాల రహస్యం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జూలియన్ రాజు ఢిల్లీలో 11 మెట్రో స్టేషన్లు మూసివేత, జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం సీజేపీ ఆందోళన కదిరిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు దేవాదుల, ,ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు సెలవుకు 'నో ఎంట్రీ'.. శ్రీ చైతన్య స్కూల్ డ్యూటీ! గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి *మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి*

ప్రమాదపుటంచున పట్టణ దారుల్లో కలవర్ట్లు

Select Suryaa Now
ప్రమాదపుటంచున పట్టణ దారుల్లో కలవర్ట్లు

ప్రమాదపుటంచన  కల్వర్టులు

ఎమ్మిగనూరు సూర్యప్రతినిధి 
గ్రేడ్ వన్ మున్సిపాలిటీ గా చెప్పుకుంటున్న ఎమ్మిగనూరులో ప్రధాన ఆదాయ వనరు కనపరిచే గాంధీనగర్లో ప్రజలు ప్రమాద పూటంచున ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.. వాహనాల సంగతి దేవుడెరుగు కానీ కాలినడకన వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నారు .. ప్రధాన రహదారిలో కల్వర్ట్ నిర్మాణం చేపడుతుండగా ఆ ప్రాంతం గుండా వెళ్ళేందుకు వీదు లోని మార్గాలు ఎంచుకునే వాహనదారులు, పాదచారులు అష్ట కష్టాలు పడుతున్నారు.. అక్కడక్కడ కల్వర్టులు దెబ్బతిని ఇనుపకడీలు తేలి ఉన్నాయి.. ఏళ్ల తరబడిగా వాటి మరమ్మతులకు నోచుకోకపోవడం చూస్తుంటే ఎమ్మిగనూరు పట్టణ పురపాలనకు ప్రజా సమస్యలు ఎంత మాత్రం పడుతున్నాయని అద్దం పడుతుంది..
ఇలా ఒక గాంధీ నగరే కాదు అనేక కాలనీలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి మార్గంలో గోతులు పడ్డ రోడ్లు తప్ప మరొకటి కనబడడం లేదు ప్రజలనుండి ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నుల ఇతర ఆదాయంతో  మూలుగుతున్న 33 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం కేటాయించకుండా అలసత్వం చేస్తున్నారు.. ఆ నిధులకు గ్రహణం వీడిందని 3.0 తో ఎమ్మిగనూరు పట్టణం అభివృద్ధి వైపు దూసుకుపోతున్నట్లు శంకుస్థాపనలైతే జరుగుతున్నాయి.. ఇకనైనా ఎంతవరకు అభివృద్ధి చేస్తారో.. ఎంతవరకు అందుతుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.. పాత బకాయిల కారణంగా గుత్తేదారులు కూడా ముందుకు రాకపోవడం జరుగుతుందని సమాచారం.. ఇంతవరకు పాత బకాయిలే రాలేదని గుత్తేదారులు కూడా వాపోతున్నారు.. పనులు చేసిన వాటికి బిల్లులు చెల్లించకుంటే పట్టణాభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని ప్రజా సంఘాలు గజమెత్తుతున్నాయి.. అయినా పాలక ప్రభుత్వాలు మాటలు తప్ప చేతుల్లో అభివృద్ధి చూపడం లేదన్న విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు..