గాంధీజీ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి. ఎస్సై ఎం హేమలత.
సీతానగరం అక్టోబర్ 2 మేజర్ న్యూస్..
గాంధీజీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సీతానగరం ఎస్సై ఎం హేమలత కోరారు ఈ మేరకు గాంధీజీ 157వ జయంతి సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో గాంధీజీ చిత్రపటానికి పూలమా వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో ఆయన తన తోటి సిబ్బందితో మాట్లాడుతూ అహింస పరమ ధర్మం కష్టాలకు ఓర్చి బ్రిటీషు వారి నుండి స్వతంత్రం తీసుకొచ్చి భారతీయులకు జాతిపితగా గాంధీజీ పిలవ బడ్డారని గాంధీజీ హింసకు చోటివ్వకుండా స్వతంత్రం తీసుకువచ్చి బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేశారని అన్నారు . ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు లంక శ్రీనివాసరావు. లక్ష్మణరావు తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.