ఎమ్మిగనూరు ఎస్‌డీపీవోగా ఆముదాల శ్రీనివాస్ నియామకం
ఎమ్మిగనూరు ఎస్‌డీపీవోగా ఆముదాల శ్రీనివాస్ నియామకం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో డీఎస్పీల బదిలీలు, పోస్టింగులు జరిగాయి. ఇందులో భాగంగా ఎమ్మిగనూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డీపీవో)గా ఆముదాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇప్పటివరకు గుంతకల్లు ఎస్‌డీపీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయనను బదిలీ చేసి ఎమ్మిగనూరు ఎస్‌డీపీవోగా పోస్టింగ్ కల్పించారు.
పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫారసుల మేరకు డీజీపీ శ్రీహరిష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబరు 30న మంగళగిరిలో జరిగిన పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సమావేశంలో డీఎస్పీల సర్వీస్ వివరాలు, ఖాళీగా ఉన్న పోస్టులను పరిశీలించిన అనంతరం బదిలీలు, పోస్టింగులకు సిఫారసు చేశారు.
ఈ మేరకు ఆముదాల శ్రీనివాస్‌ను గుంతకల్లు నుంచి ఎమ్మిగనూరు ఎస్‌డీపీవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పోస్టింగ్ తక్షణమే అమల్లోకి వస్తుందని డీజీపీ కార్యాలయం ఉత్తర్వుల్లో పేర్కొంది.