ఎస్.జి.ఎఫ్ తైక్వాండోలో రెయిన్బో విద్యార్థుల సత్తా
రిపోర్టర్ రమేష్ బాబు కొండల
ఎస్.జి.ఎఫ్ తైక్వాండోలో రెయిన్బో విద్యార్థుల సత్తా
# గోల్డ్ మెడల్ విజేతలకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
రేణిగుంట మేజర్ న్యూస్: జెడ్పీహెచ్‌ఎస్ ఎం.ఆర్.పల్లి వేదికగా నిర్వహించిన తైక్వాండో టోర్నమెంట్ 2026–27లో రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. బాలుర, బాలికల విభాగాల్లో విద్యార్థులు 6 గోల్డ్, 6 సిల్వర్, 6 బ్రాంజ్ పతకాలు సాధించారు. గోల్డ్ మెడల్స్ సాధించిన కనిష్క్, క్యాథరిన్, చాంచల్ చౌహాన్, అలియా హబీబా, షబ్నమ్, ప్రదీప్ తదితరులు రాష్ట్రస్థాయి SGF తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ పి.ఎ. ఖాన్, ప్రిన్సిపాల్ షహేర్ బాను అభినందించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన తైక్వాండో కోచ్ లోకేష్ను పాఠశాల యాజమాన్యం అభినందించింది.