మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి
మహాత్మా గాంధీ ని ఆదర్శంగా తీసుకోవాలి యాట్ల నాగేశ్వరావు
రామచంద్రపురం మేజర్ న్యూస్ :
ఆంగ్లేయుల పాలన నుండి
భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మహాత్మా గాంధీ అని నియోజకవర్గం ఎం.బి.సి సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు. మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ద్రాక్షారామ బల్లమార్కెట్ సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం యాట్ల మాట్లాడుతూ సహాయ నిరాకరణ,సత్యాగ్రహం, అహింస అతని ఆయుధాలు కొల్లాయి కట్టి, చేతికర్రబట్టి, నూలు వడికి, మురికి వాడలు శుభ్రం చేసి అన్ని మతాలు, వర్గాలు ఒక్కటే అని చాటి చెప్పిన మహనీయుడు అని తెలిపారు. ఆయన ఆశయ సాధనలో ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలని యాట్ల తెలిపారు.