గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జూలియన్ రాజు
రిపోర్టర్ : రమేష్ బాబు కొండల
గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జూలియన్ రాజు
రేణిగుంట మేజర్ న్యూస్ : మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డి. జూలియన్ రాజు రేణిగుంట బస్టాండ్ కూడలిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస, సామాజిక సమానత్వం, స్వావలంబన, గ్రామీణ స్వరాజ్యం, పారిశుద్ధ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ ఆదర్శప్రాయమని అన్నారు. అహింస, సత్యాగ్రహం ద్వారా అన్యాయాన్ని ఎదుర్కొనే మార్గాన్ని ప్రపంచానికి చూపిన మహనీయుడు గాంధీజీ అని పేర్కొన్నారు.