BREAKING
నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృత ఎన్ఫోర్స్మెంట్ చర్యలు బొగ్గు బట్టీల్లో వెట్టిచాకిరీకి విముక్తి నల్గొండలో జర్నలిస్టుల నిరసనలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం. చిన్నారులకు పౌష్టికాహారం.. ‘తొలి ముద్ద’కు శ్రీకారం గాంధీజీ జీవితం ఆదర్శనీయం -ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి : జెసి ఆర్.గోవింద రావు గాంధీ బాటలోనే స్వచ్ఛ గ్రామ స్వరాజ్యం.. బెజ్జుర్ మండలకేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు... జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి . సీమ రూపురేఖలు మార్చబోతున్నగ్లోబల్ హార్టికల్చర్ హబ్ వికలాంగులకు ర్యాంప్‌ ఏదీ? అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఉమ్మడి రవాణా పాస్ గాంధీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం సత్యం, అహింసా మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి…. - నగర మేయర్ ధర్ని మధుకర్ సీఎం డిప్యూటీ సీఎంతో అనంత్ అంబానీ బేటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి* ** ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రసాద్

గాంధీజీ ఆశయాలను ఆచరిద్దాం.. కిషోర్ గునుకుల

Select Suryaa Now
గాంధీజీ ఆశయాలను ఆచరిద్దాం.. కిషోర్ గునుకుల

గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేద్దాం… ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నెల్లూరు అభివృద్ధికి కలిసి పనిచేద్దాం 

నెల్లూరు, మేజర్ న్యూస్: జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉన్న బాపూజీ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను, స్వాతంత్ర్య సమరంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. అనంతరం కిషోర్ గునుకుల మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకాలని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీతో పాటు ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గ్రామ స్వరాజ్యమే గాంధీజీ కల

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కిషోర్ గునుకుల అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారాలు చూపించే విధానాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజల భాగస్వామ్యం, పారదర్శకమైన పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారని కిషోర్ గునుకుల పేర్కొన్నారు. ప్రజల అవసరాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వారి భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

నెల్లూరు అభివృద్ధికి కలిసి పనిచేద్దాం

గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నెల్లూరు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని కిషోర్ గునుకుల పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకమైన ప్రజా పాలన, సామాజిక బాధ్యత, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ గునుకుల, జమీర్, నరహరి, నాగేంద్ర బాలు, ప్రతాప్, శరవణ, విశ్వ కార్తిక్, ఇషాక్, తరుణ్, నరసింహా తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాపూజీకి ఘన నివాళులు అర్పించారు.