BREAKING
సల్మాన్ ఖాన్ ప్రస్తావనపై అలిగిన అర్బాజ్ ఖాన్.. ముంబై ఈవెంట్‌లో అసహనం హాలీవుడ్ ప్రీమియర్‌లో టమ్ క్రూయిజ్‌ను కలిసిన అవ్నీత్ కౌర్.. డిగర్ సినిమాపై ఆసక్తికర చర్చ కాలు కోల్పోయిన కూలికి మానవతా హస్తం టీమిండియా ఆటగాళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు ఈ నెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని అడ్డుకుంటున్నది వైసీపీనే ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శ కురుగుంట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం రెేపు గన్నవరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత.. 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అమన్ సెహ్రావత్ అక్టోబర్ 9న తెలుగులో ‘హనుమాన్ అంశ్’ విడుదల.. హోంబలే ఫిల్మ్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ ఎంట్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అశోక్ ఎమ్ ఎస్ గ్లోబల్ ట్రేడర్స్ సంస్థను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆది పినిశెట్టి ‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో జోరు ధర్మవరంలో ప్రభుత్వ ఐటీఐ, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి విద్య కోసం విద్యార్థుల వలసలకు అడ్డుకట్ట వేయాలి పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర డిమాండ్ అంత్యక్రియలకు స్మశాన వాటిక కేటాయించండి

పేదల సంక్షేమం.. గ్రామాల అభివృద్ధే లక్ష్యం

Select Suryaa Now
పేదల సంక్షేమం.. గ్రామాల అభివృద్ధే లక్ష్యం

అనంతపురం బ్యూరో : చీలేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. పల్లె పండుగ 3.0లో అభివృద్ధి పనులకు భూమిపూజ

ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ  పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. శింగనమల మండలం చీలేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, పల్లె పండుగ 3.0లో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు సేవ చేసే కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీతో కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హులైన లబ్ధిదారులకు అండగా నిలుస్తోందని తెలిపారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రతి నెలా ఆర్థిక సహాయం అందించి పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, వృద్ధులకు ఆత్మగౌరవాన్ని, పేద కుటుంబాలకు అండను, కష్టాల్లో ఉన్నవారికి భరోసాను అందించే సాధనమని వివరించారు.

అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు

కొత్త పెన్షన్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం కొత్త పెన్షన్లు త్వరలో మంజూరవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పెన్షన్లు మంజూరైన వెంటనే ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న వారితో పాటు కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు కూడా పెన్షన్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

అర్హత ఉన్న ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసనాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.