BREAKING
బాపూజీ, శాస్త్రిజీల ఆదర్శాలు నిత్య స్మరణీయం: మంత్రి నారా లోకేష్ గాంధీజీ ఆశయాలే భావితరాలకు మార్గదర్శకం:రాకేష్ రెడ్డి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజె ప్రతినిధులు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి గాంధీజీ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి. ఎస్సై ఎం హేమలత. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు.... అధికారులు. తిరుమల శ్రీవారికి నిత్యం 45 రకాల నైవేద్యాలు: మిర్చి లేకుండా మిరియాలతోనే వైఖానస ఆగమ ప్రసాదాల రహస్యం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జూలియన్ రాజు ఢిల్లీలో 11 మెట్రో స్టేషన్లు మూసివేత, జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం సీజేపీ ఆందోళన కదిరిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు దేవాదుల, ,ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు సెలవుకు 'నో ఎంట్రీ'.. శ్రీ చైతన్య స్కూల్ డ్యూటీ! గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి *మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి*

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి - ఎమ్మెల్యే

Select Suryaa Now
గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి - ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

జాతిపిత మహాత్మ గాంధీ 157వ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్ర్య సాధనకు చేసిన సేవలను స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధితో పాటు ప్రజల్లో ఐక్యత, సామాజిక బాధ్యత, మానవతా విలువలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మ గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజ శ్రేయస్సుకు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ వీఎస్ ముక్తియార్, రాజుపాలెం మండల మాజీ జెడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి, నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి, రామాంజనేయులు, మురళీధర్ రెడ్డి, వెంకటకొండయ్య, రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.