అనారోగ్యంతో పంచాయతీ కార్యదర్శి మృతి.
అనారోగ్యంతో కార్యదర్శి మాధవి మృతి.
దుమ్ముగూడెం సూర్య మేజర్ న్యూస్::
అనారోగ్యంతో మృత్యువుతో పోరాడుతూ దుమ్ముగూడెం మండలం కొత్త దంతేనం గ్రామపంచాయతీ కార్యదర్శి మాధవి(35) గురువారం మృతి చెందారు.గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కార్యదర్శికి హైదరాబాదులో ఆపరేషన్ చేయించారు.అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుని ఈ మధ్యనే తన విధుల్లో చేరి ఉండగా మరల అనారోగ్యానికి గురవడంతో మరల వైద్య పరీక్షలు నిర్వహించగా బోన్ క్యాన్సర్ వ్యాధి గా నిర్ధారణ కాగా తీవ్ర అనారోగ్యంతో పరిస్థితి విషమించి సామర్లకోట మేనమామ ఇంటి వద్ద మృతి చెందారు. కార్యదర్శి మాధవికి తల్లితండ్రులు కూడా మరణించడంతో భర్తకు విభేదాలు కారణంగా దూరంగా ఉంటూ మేనమామ వద్ద ఉంటుంది ఆమె మరణం పట్ల దుమ్ముగూడెం మండల సహా ఉద్యోగులు ప్రజాప్రతినిధులు మండల ప్రజలు దిగ్భ్రాంతి గురయ్యారు.