BREAKING
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం, భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీం కోర్టుకు.. సత్యభామపై అనుచిత వ్యాఖ్యలు: ఎం.కె. స్టాలిన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీవీకే నేతల డిమాండ్ యూఎస్ డీజిల్ ఎగుమతుల నిషేధం అమలైతే బ్రిటన్‌లో 5 శాతానికి ద్రవ్యోల్బణం: హెచ్చరిస్తున్న ఆర్థికవేత్తలు! పంటల సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం భారత్‌తో వాణిజ్య బంధాల పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగు: 300 మంది ప్రతినిధులతో భారత పర్యటనకు కెనడా మంత్రి! స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్న డా. ఏడుకొండలు ఈ ఆర్థిక సంవత్సరంలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ. 2,000 కోట్ల లాభం: కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడి! అంతర్జాతీయ మార్కెట్లో చమురు మంటలు: 100 మిలియన్ బ్యారెళ్ల నిల్వల విడుదలకు జీ7 దేశాల సంచలన నిర్ణయం బుడగ జంగం స్మశాన వాటికకు రెండు ఎకరాల భూమి కేటాయింపు మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్‌కు గట్టి ఎదురుదెబ్బ: గోప్యతా ఉల్లంఘనలపై నెదర్లాండ్స్‌లో విక్రయాల నిలిపివేత ముప్పు! అక్టోబర్ ఆర్బీఐ ఎంపీసీ భేటీ: వడ్డీ రేట్ల తగ్గింపుపై నీలినీడలు.. ద్రవ్యోల్బణం, రూపాయి క్షీణతపై ఎస్‌బీఐ రీసెర్చ్ కీలక హెచ్చరికలు! అంచనాలను మించిన టెస్లా క్యూ3 డెలివరీలు: 4,86,532 కార్ల విక్రయాలతో రికార్డు.. పుంజుకున్న యూరప్ డిమాండ్ భక్తుల రద్దీతో టి టి డి నిర్ణయం ఇద్దరు బాలురు అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల కేసు నమోదు

ఇద్దరు బాలురు అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల కేసు నమోదు

Select Suryaa Now
ఇద్దరు బాలురు అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల కేసు నమోదు

ఇద్దరు బాలురు అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల కేసు నమోదు 

రేణిగుంట మేజర్ న్యూస్ : రేణిగుంట పట్టణానికి చెందిన ఇద్దరు బాలురు అదృశ్యమైన ఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి, వారి ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నట్టు సిఐ జయచంద్ర పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. బుగ్గవీధికి చెందిన జి. నాగేంద్ర కుమారుడు జి. పాండురంగ (12), అతని స్నేహితుడు పి. గణేష్ రెడ్డి (15) కలిసి అక్టోబర్ 2న సాయంత్రం 4 గంటల సమయంలో గుంటకట్ట సమీపంలోని గ్రౌండ్‌కు ఆడుకోవడానికి వెళ్లారు. పాండురంగ సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి వచ్చి, గణేష్ రెడ్డికి చెందిన నోటుబుక్‌ను అతని ఇంటి వద్ద ఇచ్చి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం ఇద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రేణిగుంట బస్టాండ్, రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజలు ప్రాథమిక సమాచారం మేరకు రాత్రి 8.45 గంటల సమయంలో రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు బాలురు కనిపించినట్లు  పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ ఇద్దరు బాలురను ఎక్కడైనా గుర్తించినా, వారి ఆచూకీ తెలిసినా వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సమాచారం కోసం:CI: 9491074540 SI: 9440796765 రేణిగుంట పోలీస్ స్టేషన్: 08772289023