BREAKING
కోల్‌కతాలో 19వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు.. ఎన్నికల రోజే సెలవులు... ఎస్ఎంసి ఎన్నికలకు మళ్ళీ బ్రేక్... ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ దైవప్రసాద్ ముంబైలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఎప్పుడు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. యూరోపియన్ యూనియన్ ఆశయాలపై ప్రభావం చూపేలా బోస్నియాలో సాధారణ ఎన్నికల పోలింగ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పర్యటన తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. శిలాతోరణం వరకు క్యూలైన్! థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ తీరానికి చేరుకున్న యూఎస్ యుద్ధనౌక బ్యానర్లు,ప్రేమ్స్ ధ్వంసం చేయడం పిరికిపందల చర్య స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్లు: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలక వాదనలు అభివృద్ధికి నోచుకోని ఆలయ కోనేరు జపనీయుల మహిళ హత్య కేసులో అమెరికా మెరైన్ అరెస్ట్

బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీం కోర్టుకు..

Select Suryaa Now
బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీం కోర్టుకు..

 

అమరావతి, సూర్య ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో, ఆ తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై ఇవాళ సుప్రీంకోర్టులో ప్రత్యేక అప్పీల్ (Special Leave Petition) దాఖలు చేసింది.

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ, 34 శాతం బీసీ కోటాతో పరిమితి దాటుతోందని ఏపీ హైకోర్టు ఈ జీవోలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం మరియు హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన అధికార కూటమి, ఒకవేళ న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా పార్టీ పరంగా బిసిలకు 34 శాతం సీట్లు కేటాయించి పోటీలో దించడానికి సిద్ధమవుతోంది.