అభివృద్ధికి నోచుకోని ఆలయ కోనేరు
ఖాజీపేట మేజర్ న్యూస్
ఖాజీపేట మండలం పుల్లూరు సమీపంలోని నాగనాదేశ్వరకోన కిందభాగంలో ఉన్న కోనేరు నిర్వహణ లేక పూర్తిగా దెబ్బతింది. దేవాలయ శాఖ పరిధిలో ఉన్న కోనేరు అభివృద్ధిపై అధికారులు, ఆలయ పాలకవర్గం దృష్టి సారించడంలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీకమాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని, అప్పటిలోగా కోనేరుకు మరమ్మతులు చేపట్టి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.