తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెం నుంచి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గృహ నిర్మాణ రంగంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెంలో రూ.14 కోట్లతో 3డీ కాంక్రీట్ తో 117 ఇళ్ల నిర్మాణం. ఉదయం 10.40 గంటలకు ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెంలో శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఇప్పటికే 28 నెలల్లో 5.50 లక్షల ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించిన కూటమి ప్రభుత్వం.