పేద విద్యార్థికి లయన్స్ క్లబ్ చేయూత
మార్కాపురం: పేదరికం కారణంగా ప్రతిభావంతుడైన విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మార్కాపురం లయన్స్ క్లబ్ చేయూతనందించింది. ఎనిబెర స్టీవెన్సన్ నీట్‌లో 1369 ర్యాంకు సాధించి, ముంబైలోని గ్రాంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. తండ్రి ప్రసాద్ ఆటో డ్రైవర్ కావడంతో కళాశాలలో చేరేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కశెట్టి జగన్‌బాబు క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, మిత్రుల సహకారంతో 85 వేల నగదు అందజేశారు.