నేడు యధావిధిగా పిజిఆర్ఎస్
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు, డివిజన్ స్థాయిలో సంబంధిత అధికారులు, మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని పేర్కొన్నారు.
ప్రజలు కలెక్టరేట్, డివిజన్, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, గ్రామ/వార్డు సచివాలయాల్లో నేరుగా అర్జీలు సమర్పించవచ్చని, 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి పనిదినం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలను ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తెలియజేయాలని కోరారు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 ద్వారా 300కు పైగా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అందుబాటులో ఉన్న సేవా మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.