BREAKING
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్ఎస్ నాయకులు నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు గండి.. తుంగభద్ర జలాలు వృథా ఉత్తమ గ్రంథపాలకుడిగా నాసిక శివాజీకి పురస్కారం రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జగ్గయ్యపేట యువతికి బంగారు పతకం.సీనియర్ మహిళల 47 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించిన వేమవరపు రత్నకుమారి బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి పరామర్శ వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి పేద విద్యార్ధి ఉన్నత చదువులకు ఆర్థిక చేయుత. ఆధునిక సాగు విధానాలపై రైతులకు మార్గదర్శనం :జిల్లా డైరెక్టర్ పత్తి దత్తుడు దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కాళికామాత ఆలయ కమిటీ ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు మహబూబ్ నగర్ ప్రత్యక్షమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పై హర్షం నేషనల్ పార్క్ పూర్వవైభవానికి 31 రోజుల కార్యాచరణ చీరాలలో పోలీసులు విస్తృత తనిఖీలు

ఘనంగా అంగన్వాడీ పోషణ మాసోత్సవాలు

Select Suryaa Now
ఘనంగా అంగన్వాడీ పోషణ మాసోత్సవాలు

 

-ఆరోగ్యకరమైన కుటుంబాలతో సుస్థిర సమాజం

 

- ఐసిడిఎస్ సూపర్వైజర్ నౌజియా బేగం వెల్లడి
పెద్దమండ్యం,మేజర్ న్యూస్ : ఆరోగ్యకరమైన కుటుంబాలతో సుస్థిర సమాజాన్ని నెలకొల్పవచ్చునని ఐసిడిఎస్ సూపర్వైజర్ నౌజియా బేగం పేర్కొన్నారు.ఐసిడిఎస్ సిడిపిఓ సుజాత ఆదేశాల మేరకు శనివారం మండలంలోని పెద్దమండ్యం పంచాయతీ రెడ్డివారిపల్లి,పాపేపల్లి పంచాయతీ దాసరిపేట అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ నౌజియా బేగం మాట్లాడుతూ సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8 వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని,పోషక విలువలతో కూడిన ఆహారం అందించడమే అంగన్వాడీల లక్ష్యమన్నారు.గర్భవతులు,బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు.క్రమం తప్పకుండా పోషక ఆహారం తీసుకోవాలని తద్వారా ఆరోగ్యకరంగా జీవించాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు,అంగన్వాడీ వర్కర్లు,సహాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.