BREAKING
పేద విద్యార్థికి లయన్స్ క్లబ్ చేయూత సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి ఇంధన సంక్షోభం: 10 కోట్ల బ్యారెళ్ల అత్యవసర నిల్వలు విడుదల చేయనున్న జీ7 దేశాలు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఘన స్వాగతం. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు రద్దు: భారీగా పెరిగిన భక్తుల రద్దీ టీడీపీ బలోపేతమే లక్ష్యం. సమన్వయంతో ముందుకు సాగాలి ఘనంగా అంగన్వాడీ పోషణ మాసోత్సవాలు తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కోనసీమ జెడ్పీ చైర్మన్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి ఆరుట్లలో ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు నేడు యధావిధిగా పిజిఆర్ఎస్ సిద్ధలాపురంలో బర్డ్ ఫ్లూ కలకలం వ్యాధి వ్యాప్తి నివారణకు అధికారుల అప్రమత్తం శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు వికారాబాద్ జిల్లాలో వర్షాభావం

బ్యానర్లు,ప్రేమ్స్ ధ్వంసం చేయడం పిరికిపందల చర్య

Select Suryaa Now
బ్యానర్లు,ప్రేమ్స్ ధ్వంసం చేయడం పిరికిపందల చర్య


- ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
- పోలీసులకు తెలుగుదేశం నేత పి.సురేంద్ర యాదవ్ ఫిర్యాదు
కురబలకోట : అక్టోబర్ 2న మదనపల్లె పట్టణంలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.ఈ శంకుస్థాపనలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటి సి.ఎం కొణిదెల పవన్ కళ్యాణ్,కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి,ఐ.టి.ఎలక్ట్రాన్రిక్స్ కమ్యూనికేషన్ల శాఖల మంత్రి నారా లోకేష్,రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత అంబానీ,ఇతర మంత్రుల రాకకు తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ జి.శంకర్ యాదవ్ స్వాగతం పలుకుతూ ముదివేడు నుండి మదనపల్లి వరకు పెద్దఎత్తున ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి,బ్యానర్లను ఫ్రేమ్స్ తో సహా దొంగిలించుకుపోయారాని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ పేర్కొన్నారు.దీనిపై ముదివేడు ఎస్.ఐ మధు రామచంద్రుడికి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నానని,రాజకీయంగా ఎదుర్కోలేక బ్యానర్లు ధ్వంసం చేయడం,అపహరించకపోవడం వంటి పిరికిపందల చర్యలు మానుకోవాలన్నారు.ఒక్కో బ్యానర్ ప్రింట్ చేయడానికి సుమారు రూ.1500,అలాగే ఒక్కో బ్యానెర్ ఫ్రేమ్ తయారు చేయడానికి రూ.1800 ఖర్చు చేశానన్నారు.ఒక్కొక్క బ్యానర్ చిన్నవి,పెద్దవి అన్ని కలుపుకొని సుమారు 100కుపైగా బ్యానర్లను దొంగిలించుకుపోయారని,వీటి విలువ సుమారు రూ.3,50,000 వరకు ఉంటుదని ఆవేదన వ్యక్తం చేశారు.గత సంవత్సరంలో కూడా తంబళ్లపల్లి నియోజకవర్గం,హార్సిలీహిల్స్ నందు అన్నమయ్య జిల్లా,ఇన్చార్జ్ బి.సి.జానర్ధన్ రెడ్డి మరియు జోన్-4 ఇన్చార్జ్ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి సైతం తాను ఏర్పాటు చేసిన ప్రముఖుల స్వాగత బ్యానెర్స్ కూడా చింపిపడేసి తెలుగుదేశం పార్టీని,నన్ను అవమాన పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో కట్టిన కేసు ఎఫ్.ఐ.ర్ నెం.68/2025 రుగా కలదన్నారు.ఇలా బ్యానర్లు ధ్వంసం చేయడం కాదని,ఎవరికైనా దమ్ముంటే నేరుగా ఢీకొట్టాలని సురేంద్ర యాదవ్ సవాల్ విసిరారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలని,బ్యానెర్స్ ధ్వంసం చేసి దొంగిలించిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.