BREAKING
పేద విద్యార్థికి లయన్స్ క్లబ్ చేయూత సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి ఇంధన సంక్షోభం: 10 కోట్ల బ్యారెళ్ల అత్యవసర నిల్వలు విడుదల చేయనున్న జీ7 దేశాలు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఘన స్వాగతం. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు రద్దు: భారీగా పెరిగిన భక్తుల రద్దీ టీడీపీ బలోపేతమే లక్ష్యం. సమన్వయంతో ముందుకు సాగాలి ఘనంగా అంగన్వాడీ పోషణ మాసోత్సవాలు తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కోనసీమ జెడ్పీ చైర్మన్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి ఆరుట్లలో ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు నేడు యధావిధిగా పిజిఆర్ఎస్ సిద్ధలాపురంలో బర్డ్ ఫ్లూ కలకలం వ్యాధి వ్యాప్తి నివారణకు అధికారుల అప్రమత్తం శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు వికారాబాద్ జిల్లాలో వర్షాభావం

కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..

Select Suryaa Now
కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..

 పలు అంశాలపై చర్చలు

తెనాలిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనకు ముందు భేటీ

సీఎం ఆహ్వానం మేరకు నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి

సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

ఏపీ సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం భేటీ అయ్యారు. తెనాలిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే ముందు సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆత్మీయంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రం నుంచి అందుతున్న సహకారం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది. తెనాలిలో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు, సంక్షేమ ఫలాలు అందించే అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి ఆయన నివాసానికి రావడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.